GDWL: పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలనే ప్రధాన డిమాండ్‌తో బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ఈనెల 29న చేపట్టనున్న ‘హలో విద్యార్థి-ఛలో కలెక్టరేట్’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కో-ఆర్డినేటర్ కురువ పల్లయ్య పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పలు డిగ్రీ, పీజీ విద్యార్థులతో సమావేశం అయ్యారు.