SKLM: మోంథా తుఫాను ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న దృష్ట్యా జిల్లా ప్రత్యేక అధికారి చక్రధర బాబు సోమవారం సంత బొమ్మాలి, పోలాకి మండలాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించారు. జిల్లా యంత్రాంగం చేపట్టిన ముందస్తు ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. ప్రాణ నష్టం సున్నా లక్ష్యంగా పనిచేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా అధికారులు పాల్గొన్నారు.