SDPT: అమరవీరుల సంస్మరణ సందర్భంగా వడ్లూరు గ్రామాన్ని ఎస్సై సౌజన్య సోమవారం సందర్శించి, ప్రజలతో మమేకమై ప్రజా దర్బార్ నిర్వహించారు. గ్రామస్తుల సమస్యలను విన్న ఎస్సై సౌజన్య వాటిని త్వరితగతిన పరిష్కరిస్తామన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై సంబంధిత శాఖాధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. యువతలో పెరుగుతున్న మత్తు పదార్థాల అలవాటుపై అవగాహన కల్పించారు.