SRD: జిల్లాలోని 3,750 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు లక్ష్యంగా నిర్ణయించినట్లు కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. లక్ష్య సాధన కోసం వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పటినుంచే కృషి చేయాలని చెప్పారు. ఆయిల్ ఫామ్ పంట సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని చెప్పారు.