MDK: మెదక్ మండలం రాయపల్లి గ్రామంలోని ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ధాన్యం సేకరణ జరుగుతున్న తీరును పరిశీలించి పలు సూచనలు చేశారు. రైతు పండించిన ఆఖరి గింజ వరకు కొనుగోలు చేస్తామని పేర్కొన్నారు. సేకరణ తర్వాత జాప్యం లేకుండా రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తామన్నారు.