VSP: 4 కేజీల గంజాయితో ఎంవీపీ పోలీసులకు చిక్కిన కీలక రౌడీషీటర్ బీ. రాము సోమవారం పోలీసుల నుంచి తప్పించుకుని పరారయ్యాడు. అరెస్ట్ చేసి వైద్య పరీక్షలు నిర్వహిస్తుండగా అతను పారిపోయాడు. దీంతో పోలీసులు గాలింపు చేపట్టారు. చివరకు కేజీహెచ్ వార్డు బాయ్ కాలనీలోని బాత్రూంలో దాక్కున్న రౌడీషీటర్‌ను పోలీసులు పట్టుకున్నారు.