NGK: జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కి 19 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. కలెక్టర్ ఏవో చంద్రశేఖర్ దరఖాస్తులను స్వీకరించిన అనంతరం వాటిని పరిశీలించి సంబంధిత శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిష్కరించేందుకు ఆయా శాఖల అధికారులు కృషి చేస్తారని ఆయన పేర్కొన్నారు.