NGKL: జిల్లాలోని 63 రైతు వేదికల్లో మంగళవారం ‘రైతు నేస్తం’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ బదావత్ సంతోష్ ఇవాళ తెలిపారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ ద్వారా నిర్వహించే ఈ కార్యక్రమంలో రేపు ఉదయం 10 నుంచి 11 గంటల వరకు పత్తి కొనుగోలు, మొక్కజొన్న కొనుగోలు అంశాలపై సమీక్ష ఉంటుందన్నారు. రైతు సోదరులు అందరు రైతు వేదికలో పాల్గొనాలని ఆయన కోరారు.