అన్నమయ్య: మదనపల్లె కేంద్రంగా గంజాయిని విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ మహేంద్ర తెలిపారు. సోమవారం పాత్రికేయ సమావేశంలో ఆయన మాట్లాడారు. తట్టివారి పల్లె వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా శ్రీనివాసులు, ఆనంద్ కుమార్ పట్టుబడ్డారన్నారు. వీరి నుంచి రూ.20 వేలు విలువచేసే గంజాయిని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశామన్నారు.