KMM: సత్తుపల్లి అర్బన్ పార్కులో అటవీ శాఖ ఆధ్వర్యంలో నూతన వాహనం (ట్రాక్టర్)ను ఎమ్మెల్యే మట్టా రాగమయి సోమవారం అధికారులతో కలిసి ప్రారంభించారు. అర్బన్ పార్కు అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించిందని అన్నారు. కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు గాదె చెన్నకేశవరావు, డివిజన్ ఫారెస్ట్ ఆఫీసర్ మంజుల, ఎఫ్ఆర్ఓ స్నేహలత, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.