BDK: మాదక ద్రవ్యాలు లేని సమాజాన్ని నిర్మించడంలో విద్యార్థుల పాత్ర కీలకమని అశ్వాపురం సీఐ అశోక్ రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు చైతన్యం-డ్రగ్స్‌పై యుద్ధం కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు స్థానిక పోలీస్ స్టేషన్ నుండి జగదాంబ సెంటర్ వరకు ప్ల కార్డ్స్ పట్టుకొని భారీ ర్యాలీ నిర్వహించారు.