NDL: ఆత్మకూరు మండలంలో నల్ల కాలువలు చెరువులో పడి మూడు ఎద్దులు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. సోమవారం బడే సాహెబ్ అని రైతు నాలుగు ఎద్దులను చెరువు కట్ట మీదికి మేతకు తీసుకొని వెళ్లి తిరిగి వస్తుండగా బండికి కట్టిన ఎద్దులు బెదరడంతో ఊట చెరువులో బండి తిరిగి పడింది. దీంతో రైతు వెంటనే ఒక ఎద్దును తప్పించారు. మూడు ఎద్దులను తప్పించ లేకపోవడంతో ఊపిరాడక మృతి చెందాయని తెలిపారు.