TG: సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టుకు మరమ్మతులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జలాశయాన్ని ఖాళీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రెండేళ్ల పాటు రిజర్వాయర్ ఖాళీగా ఉంటుంది. దీంతో హైదరాబాద్ వాసులకు తాగునీటి ఇబ్బందులు రాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే డ్యాం మరమ్మతుల కోసం ప్రభుత్వం రూ. 16కోట్లను విడుదల చేసింది.