SKLM: హిరమండలం వద్ద గొట్ట బ్యారేజీలో నిలకడగా వరద నీరు కొనసాగుతుందని డీఈ సరస్వతి తెలిపారు. మంగళవారం ఉదయం ఆమె ఒక ప్రకటనలో మంగళవారం ఉదయం 5 గంటలకు 8,456 క్యూసెక్కుల నీరు చేరిందని దానిని నదిలోకి నేరుగా విడిచి పెడుతున్నామని పేర్కొన్నారు. 14 గేట్లు 20 సెంటీమీటర్లు ఎత్తున ఎత్తివేయడం జరిగిందన్నారు. కుడి ఎడమ కాలువలు మూసివేసామని వివరించారు.