AP: రాష్ట్రం వైపు వేగంగా దూసుకొస్తున్న మొంథా తుపానుపై కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. పునరావాస కేంద్రాల్లో అన్ని సదుపాయాలతో పాటు.. ఒక్కో కుటుంబానికి రూ.3 వేలు ఇవ్వాలని పేర్కొన్నారు. కుటుంబానికి 25 కిలోల బియ్యం, నిత్యావసరాలు పంపిణీ చేయాలని సూచించారు. పునరావాస కేంద్రాలతో పాటు జిల్లాల్లో వైద్య సేవలు అందించేలా ఏర్పాటు చేయాలన్నారు.