కృష్ణా: గుడ్లవల్లేరులో ఏర్పాటు చేసిన 6 పునరావాస కేంద్రాలను తహసీల్దార్, ఎస్సైతో కలిసి ఎంపీడీవో ఎం.డీ ఇమ్రాన్ సందర్శించారు. మండల పరిషత్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, ప్రజలు ఎవరైనా తుఫాను కారణంగా సమస్యలు ఎదుర్కొంటే, తక్షణమే మండల కంట్రోల్ రూమ్‌కి సమాచారం అందించాలని ఎంపీడీవో పేర్కొన్నారు. ఈ క్రమంలో లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు.