బాపట్ల: పట్టణంలోని గడియారం సెంటర్ వద్ద రోడ్డుపై గుంతల సమస్యకు శాశ్వత పరిష్కారం దొరకడం లేదని ప్రజలు వాపోతున్నారు. ఎన్నిసార్లు గుంతలు తీసినా, సరిగా పూడ్చకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. నిత్యం వాహనదారులు, బాటసారులు తిరిగే ఈ నడిబొడ్డు ప్రాంతంలో గుంతలు ఉండడం విచారకరం. ప్రజలను ప్రమాదాల బారి నుంచి కాపాడాలని పట్టణ ప్రజలు మున్సిపల్ అధికారులను కోరుతున్నారు.