BPT: రాబోయే రెండు రోజులు భారీ వర్షాలు, ఈదురు గాలులు ఉంటాయని, అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని కలెక్టర్ వినోద్ కుమార్ ప్రజలకు సూచించారు. చీరాల ‘రెడ్ అలర్ట్’లో ఉందని ఆయన తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు విలువైన వస్తువులతో సహా పునరావాస కేంద్రాలకు వెళ్లాలన్నారు. ఆరోగ్య కేంద్రాల్లో డాక్టర్లు, సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండాలని ఆయన సూచించారు.