GNTR: ‘మొంథా’ తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు, బలమైన గాలులు వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇవాళ పొన్నూరు తహసీల్దార్ మహమ్మద్ జియావుల్ పునరావాస కేంద్రాలను పరిశీలించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. అక్కడ విద్యుత్, నీరు వంటి అన్ని మౌలిక వసతులు కల్పించారు. తుఫానును సమర్థంగా ఎదుర్కోవడానికి అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.