GNTR: పాత గుంటూరు ఆర్టీసీ కాలనీకి చెందిన 3 ఏళ్ల బాబు కిడ్నాప్ కేసును పోలీసులు గంటల వ్యవధిలోనే ఛేదించారు. కుటుంబ సమస్యలు, అప్పుల కారణంగా బాబు మేనత్త కూతురు అయిన పఠాన్ షకీలా కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేసింది. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి నిందితురాలిని గుంటూరు బస్టాండ్ వద్ద అరెస్ట్ చేసి, బాబును క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు.