HYD: నగరంలోని బుద్ధభవన్‌లో సోమవారం నిర్వహించిన హైడ్రా ప్రజావాణికి 52 ఫిర్యాదులు అందినట్లు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తూములు మూసేసి అలుగుల ఎత్తు పెంచుతున్నారని కొంతమంది, చెరువుల్లో మట్టి పోసి ఎకరాల కొద్ది కబ్జా చేస్తున్నారని మరి కొంతమంది ఫిర్యాదు చేశారన్నారు. పరిష్కార బాధ్యతలను సంబంధిత అధికారులకు అప్పగించినట్లు పేర్కొన్నారు.