అన్నమయ్య: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నిమ్మనపల్లె మండలంలోని బహుద ప్రాజెక్ట్ నిండుకుండలా మారి పరవళ్ళు తొక్కుతోంది. ఈ నేపథ్యంలో ఇవాళ ఎమ్మెల్యే షాజహాన్ భాష బహుద ప్రాజెక్టుకు జల హారతి ఇచ్చారు. ముందుగా స్థానిక టీడీపీ నాయకులు RJ వెంకటేష్ ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ సంక్షేమ పాలనకు ప్రకృతి సైతం సహకరిస్తోందని అన్నారు.