KRNL: ఆరోగ్యశ్రీ పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని ఏఐవైఎఫ్ నాయకులు కొంగర శ్రీనివాసులు డిమాండ్ చేశారు. ఈ విషయంపై సోమవారం కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రం పబ్లిక్ గ్రీవేన్స్లో కలెక్టర్కు అందజేశారు. ఆరోగ్యశ్రీ వైద్య సేవలు యధావిధిగా కొనసాగే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.