KDP: పొన్నలురు మండలంలోని ఉప్పలదిన్నె గ్రామ పంచాయతీలో సోమవారం మండల స్పెషల్ ఆఫీసర్ సువార్త పర్యటించారు. ఈ మేరకు పాలేరు వాగు సమీపంలో ఉన్న ఎస్టీ కుటుంబాలను కలిసి మొంథా తూఫాన్ గురించి వారికి అవగాహన కల్పించి, వారిని గ్రామములో గల ప్రభుత్వ పాఠశాలకు తరలించాలని సచివాలయ సిబ్బందికి సూచించారు. అనంతరం తుఫాన్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.