ATP: ‘మొంథా’ తుఫాన్ నేపథ్యంలో జిల్లాలో కురిసే వర్షాలకు ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. జిల్లా కేంద్రంలో కమాండ్ కంట్రోల్ రూమ్ (8500292992) ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మండలాల తహసీల్దార్, ఆర్డీవో కార్యాలయాల్లో కూడా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. వర్షం పడే వేళ ప్రజలు బయట ఉండొద్దని సూచించారు.