RR: మీర్పేట్ PS పరిధిలో విజయ్ కుమార్ అనుమానాస్పద మరణం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోస్ట్ మార్టం నివేదికలో హత్యగా నిర్ధారణ కావడంతో భార్య సంధ్య నిందితురాలని తేలింది. మద్యం సేవించి వేధించే భర్తతో గొడవ జరగడంతో, అక్టోబర్ 19న చున్నీతో గొంతు బిగించి చంపినట్లు సంధ్య ఒప్పుకుంది. దీంతో పోలీసులు ఆమెను ఈరోజు అరెస్టు చేశారు.