NTR: APSSDC ఆధ్వర్యంలో జర్మనీలో ఎలక్ట్రీషియన్ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా నైపుణ్య అభివృధి అధికారి శ్రీనివాసరావు సూచించారు. ITI, డిప్లొమా ఎలక్ట్రీషియన్ కోర్సు పూర్తి చేసి, 2 ఏళ్ల అనుభవం కలిగి 30 ఏళ్లలోపు ఉన్నవారు అర్హులన్నారు. ఆసక్తి కలిగినవారు naipunyam.ap.gov.in/user-registrationలో నవంబర్ 2లోపు నమోదు చేసుకోవాలన్నారు.