విజయనగరం కలెక్టరేట్లో తుఫాను కంట్రోల్ రూమ్‌ను సోమవారం రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్నారై వ్యవహారాల శాఖామంత్రి కొండపల్లి శ్రీనివాస్ సందర్శించారు. తుఫాను సన్నద్ధతను కలెక్టర్ రాంసుందర్ రెడ్డి మంత్రికి వివరించారు. అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి శ్రీనివాస్ ఆదేశించారు.