GNTR: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలోని పీజీ ఆర్ట్స్, సైన్స్ కోర్సుల 3వ సెమిస్టర్ పరీక్షలు నవంబర్ 18, 2025న ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు తమ ఫీజులను నవంబర్ 3వ తేదీలోపు చెల్లించాలని, ఇంటర్నల్ మార్కులను సమర్పించడానికి చివరి గడువు డిసెంబర్ 15, 2025 అని వర్సిటీ నోటిఫికేషన్లో సోమవారం పేర్కొంది. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని కోరింది.