MDCL: పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా ఈస్ట్ జోన్ DCP బాలస్వామి ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో రక్తదాన శిబిరం నిర్వహించారు. అడిషనల్ DCP నర్సయ్య మాట్లాడుతూ.. రక్తదానం మహాదానమని, ఇది ప్రాణాలను కాపాడుతుందన్నారు. ఈస్ట్ జోన్లో 2 శిబిరాల ద్వారా 1000 యూనిట్ల రక్తం సేకరించి బ్లడ్ బ్యాంక్‌లకు అందిస్తామని, ఇది అమరవీరులకు నివాళి అని తెలిపారు.