KDP: శివునికి అత్యంత ప్రీతికరమైన కార్తీకమాసంలో మైదుకూరు మండలం చిన్నయ్యగారిపల్లె సమీపంలోని ముక్కొండలో నెలకొన్న ముక్కంటి మల్లేశ్వర ఆలయంలో వెలసిన మల్లేశ్వరస్వామికి మొదటి కార్తీక సోమవారం పూజారులతో పూజలు, అభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు స్వీకరించారు.