KDP: ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తే RMP క్లినిక్లను, సర్టిఫికెట్లను సీజ్ చేస్తామని అడిషనల్ DMHO డాక్టర్ రవిబాబు హెచ్చరించారు. అట్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో RMPలకు ఆయన కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ… ప్రాథమిక చికిత్స అందించాలే తప్ప ఫ్లూయిడ్స్ ఎక్కించకూడదన్నారు. అనంతరం వైద్యం కోసం దగ్గరలోని పీహెచ్సీ, సీహెచ్సీలకు వారిని పంపించాలని సూచించారు.