ADB: జిల్లా కేంద్రంలో మద్యం దుకాణాల కేటాయింపు లక్కీ డ్రా నిర్వహణ ప్రక్రియ సోమవారం పారదర్శకంగా కొనసాగింది. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ రాజర్షి షా లాటరీ ప్రక్రియ ప్రకారం మద్యం దుకాణాలను కేటాయించారు. కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో ఎటువంటి అవాంతరాలు లేకుండా సాగేందుకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.