TPT: గూడూరు పట్టణంలోని ఎన్డీపీవో కార్యాలయంలో సోమవారం పోలీసు సిబ్బందికి రెయిన్ కోట్లను డీఎస్పీ డాక్టర్ పీ.గీతా కుమారి పంపిణీ చేశారు. ఆమె మాట్లాడుతూ.. పది రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో పోలీసు సిబ్బంది తడుస్తూ విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. దీనిని దృష్టిలో ఉంచుకుని మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశ్యంతో ఈ ఏర్పాట్లు చేశామని ఆమె పేర్కొన్నారు.