ASR: డుంబ్రిగుడ మండలంలోని పనసపుట్టు మోడల్ కాలనీలో తాగునీరు సరఫరా చేసే మోటర్ మరమ్మతులు గురించి హిట్ టీవీలో ప్రచురించిన కథనానికి సంబంధిత అధికారులు వెంటనే స్పందించారు. గంటల వ్యవధిలోనే పంచాయతీ అధికారులు గ్రామానికి చేరుకుని మోటర్ మరమ్మతులు చేపట్టారు. తాగునీటి కోసం అనేక ఇబ్బందులు పడ్డామని స్థానికులు తెలిపారు. మరమ్మతులు చేపట్టడంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు.