GDWL: ఆయిల్ ఫామ్ సాగుపై రేపు అయిజ సింగల్ విండో కార్యాలయ ఆవరణలో అవగాహన సదస్సు ఏర్పాటు చేసినట్లు విండో ఛైర్మన్ పోతుల మధుసూదన్ రెడ్డి ఇవాళ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా ఉద్యానవన శాఖ, తెలంగాణ ఆయిల్ ఫెడ్, సహకార సంఘం ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్‌పై అవగాహన కల్పిస్తారన్నారు. పరిసర ప్రాంత రైతులు హాజరై ఆయిల్ ఫామ్ సాగుపై అధికారులు ఇచ్చే సూచనలు పాటించాలని ఆయన కోరారు.