కన్నడ స్టార్ రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో నటించిన బ్లాక్బస్టర్ చిత్రం ‘కాంతార ఛాప్టర్-1’ ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. ప్రపంచవ్యాప్తంగా రూ.800 కోట్లకుపైగా వసూళ్లు సాధించిన ఈ సినిమా ఈనెల 31 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు మేకర్స్ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఈ చిత్రం అందుబాటులో ఉంటుందని ప్రకటించారు.