NZB: జిల్లాలో నిరుద్యోగులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కోసం ఈ నెల 29న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి బీ.పీ మధుసూదన్ రావు సోమవారం తెలిపారు. ఇంటర్, డిగ్రీ ఉన్న అభ్యర్థులు శివాజీ నగర్లో ఈనెల 29న ఉదయం 10.30ల నుంచి మధ్యాహ్నం వరకు ఉద్యోగ మేళాలో పాల్గొనాలన్నారు. మరిన్ని వివరాలకు ఫోన్ 9959456793, 9948748428కు సంప్రదించాలని పేర్కొన్నారు.