ATP: జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా ఎస్పీ పి.జగదీష్ ప్రజల నుంచి 145 ఫిర్యాదులు స్వీకరించారు. ప్రతి పిటీషన్ను లోతుగా విచారించి చట్ట పరిధిలో పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. భార్యాభర్తల విభేదాలు, కుటుంబ, రహదారి వివాదాలపై వచ్చిన ఫిర్యాదులను ఎస్పీ స్వయంగా సమీక్షించారు.