AP: మొంథా తుఫాన్ ప్రభావంతో ఉత్తరాంధ్ర, రాయలసీమకు ఫ్లాష్ ఫ్లడ్ ముప్పు ఉండనుంది. కాకినాడ దగ్గర తీరం దాటే సమయంలో అలల తీవ్రత పెరగనుంది. 50 కి.మీ పరిధిలో సాధారణ ఎత్తు కంటే మీటర్ ఎత్తున అలలు వస్తున్నాయి. భారీ నుంచి అత్యంత భారీ వర్షాల కారణంగా ప్రభుత్వం ఫ్లాష్ ఫ్లడ్స్ వార్నింగ్ జారీ చేసింది. కోస్తాంధ్రలో నెల్లూరు, ప్రకాశం, విజయనగరం, విశాఖకు ఎక్కువ ముప్పు ఉండనుంది.