SRCL: విధి నిర్వహణలో ప్రాణాలను అర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని జిల్లా అదనపు ఎస్పీ చంద్రయ్య అన్నారు. పోలీస్ అమరవీరుల సంపూర్ణ వారోత్సవాలలో భాగంగా సోమవారం సాయంత్రం సిరిసిల్ల పట్టణంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు.