NRML: నిర్మల్ ఆర్టీసీ డిపో నుండి సోమవారం అయోధ్య–కాశీ యాత్ర బస్సు బయలుదేరిందని డిపో మేనేజర్ కె.పండరి తెలిపారు. రెండు రోజుల్లో సీట్లు పూర్తిగా బుక్ కావడంతో భక్తుల డిమాండ్ మేరకు నవంబర్ 6న మరో బస్సు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో యాత్రలు సురక్షితమని ఆయన భక్తులను కోరారు.