ప్రకాశం: సీఎం చంద్రబాబును మాచర్లలో కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డిని ఆప్యాయంగా పలకరించిన సీఎం చంద్రబాబు కనిగిరి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలపై ఆరా తీశారు. నియోజకవర్గంలో పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.