NTR: తుఫాన్ నేపథ్యంలో నందిగామ మున్సిపాలిటీ అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాల్లో ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టామని కమిషనర్ జీ. లోవరాజు తెలిపారు. పాత బస్టాండ్ ఫంక్షన్ హాల్, జిల్లా పరిషత్ హైస్కూల్, కేంద్రీయ విద్యాలయంలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి, డ్రైనేజి పూడిక తీత పనులు పూర్తి చేశామన్నారు.