TPT: టీం ఇండియా మాజీ కెప్టెన్ M.S ధోనిని శ్రీకాళహస్తి MLA బొజ్జల సుధీర్ రెడ్డి సోమవారం ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం చరిత్రను ధోనికి వివరించి ఆలయాన్ని సందర్శించాలని కోరారు. ఇందుకు ధోని సానుకూలంగా స్పందిస్తూ త్వరలోనే స్వామివారిని దర్శించుకుంటానని తెలియజేసినట్లు MLA పేర్కొన్నారు.