CTR: పుంగనూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్లో నుండి బయటకు వచ్చే వర్షపు నీరు తమ గృహాల్లోకి వచ్చి చేరుతున్నట్లు నివాసితులు తెలిపారు. సోమవారం యార్డులో ఛైర్మన్ సెమీపతి, సెక్రటరీ గోపిని స్థానికులు కలిశారు. ఈ మేరకు వినతిపత్రం అందజేసి వారు ఎదుర్కొంటున్న సమస్యను వివరించారు. అనంతరం తాము వచ్చి పరిశీలించి కాల్వల్లో నీటి ప్రవాహం సాఫీగా జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.