కృష్ణా: మెంథా తుఫాను నేపథ్యంలో ప్రజల్లో అప్రమత్తత కల్పించేందుకు పోలీసులు సోమవారం ముందస్తు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఘంటసాల ఎస్సై ప్రతాప్ రెడ్డి ఘంటసాల తహసీల్దార్‌తో కలిసి మండలంలోని తుఫాను ప్రభావిత ప్రాంతాలను సందర్శించి, ప్రమాదానికి లోనయ్యే అవకాశం ఉన్న ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. వారిని సమీప పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని సూచించారు.