BHPL: ప్రజావాణిలో వచ్చిన సమస్యలను తక్షణనే పరిష్కరించాలని భూపాలపల్లి జిల్లా అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ అన్నారు. సోమవారం ఐడీవోసి కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి 36 దరఖాస్తులను ఆయన స్వీకరించారు. అనంతరం సమస్యలను సంబంధిత అధికారులకు ఎండార్స్మెంట్ చేసి సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు.