MBNR: చిన్నచింతకుంట మండలం కురుమూర్తి జాతర సందర్భంగా భక్తుల కోసం 257 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు RTC రీజనల్ మేనేజర్ సంతోష్ తెలిపారు. ఈరోజు, రేపు మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, కొత్తకోట, దేవరకద్ర, ఆత్మకూరు సహా పలు ప్రాంతాలనుంచి ప్రత్యేక బస్సులు నడుస్తాయని, ముఖ్యంగా ఈరోజు జరిగే ఉద్దాల మహోత్సవం ఒక్కరోజే 150 బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు.