ప్రకాశం: రాచర్ల మండలంలోని పలుగుంటపల్లిలో బొప్పాయి పంటను ఉద్యానశాఖ అధికారి శ్వేత సోమవారం పరిశీలించారు. ఇటీవల కురిసిన వర్షాలు పంటలపై ఎలాంటి ప్రభావం చూపిందో సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారి శ్వేత మాట్లాడుతూ.. బొప్పాయి పంటలో వ్యాధులు, నీటి నిల్వలు, ఎరువుల వినియోగం వంటి అంశాలను రైతులు శ్రద్ధగా గమనించాలని సూచించారు.